: కేరళలో కొలువుదీరిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం.. సీఎంగా పినరయి సహా 19మంది ప్రమాణ స్వీకారం


సీపీఎం కేరళ నేత పినరయి విజయన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ తో సహా 19మంది నేతలు ఆ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ పి.సదాశివం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం వీరి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీపీఎం నేతలంతా హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌) 91 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News