: ఐశ్వర్య ఆ లిప్ స్టిక్ వేసుకోవడం వల్లే ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు!: సోనమ్ కపూర్
కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గోవడాన్ని బాలీవుడ్ నటులు గర్వంగా భావిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారంతా ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడతారు. ఆ క్రమంలో ఇంతవరకు ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ ఈసారి విమర్శలు ఎదుర్కొన్నారు. పర్పుల్ కలర్ లిప్ స్టిక్ తో కనిపించిన ఐశ్వర్యారాయ్ ను చూసి... నేరేడుపళ్లు తిని వచ్చి నోరు కడుక్కోవడం మర్చిపోయిందని పలువురు ఎద్దేవా చేస్తే...సోనమ్ కపూర్ బీహార్ లో తయారు చేసే రుమాలీ రోటీని వేసుకొచ్చేసిందని విమర్శలు వచ్చాయి. వీటిపై సోనమ్ మాట్లాడుతూ, ఫ్యాషన్ అంటే అందరి దృష్టిని ఆకర్షించడమని చెప్పింది. అందరూ ఆ లిప్ స్టిక్ గురించి మాట్లాడుకోవడానికే ఐశ్వర్యారాయ్ పర్పుల్ కలర్ లిప్ స్టిక్ వేసుకుందని, ఆమె ఊహించినట్టే అంతా పర్పుల్ లిప్ స్టిక్ గురించి చర్చించుకుంటున్నారని సోనమ్ చెప్పింది. ఐష్ ఆ రంగు లిప్ స్టిక్ వేసుకోవడం తనకు సంతోషాన్ని కలిగించిందని సోనమ్ తెలిపింది.