: మహిళలను వక్రదృష్టితో చూస్తున్న భారత్ మీడియా: ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ మండిపాటు


మహిళలను భారతీయ మీడియా ఎప్పుడూ వక్ర దృష్టితోనే చూస్తోందంటూ కేరళలోని మున్నార్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మెరిన్ జోసెఫ్ మండిపడ్డారు. ‘భారత్ లో అందమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు’ అంటూ ఇటీవల ఒక హిందీ దినపత్రికలో వారి జాబితాను ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అందమైన ఐఏఎస్, ఐపీఎస్ పురుష అధికారుల జాబితాను ఎప్పుడైనా చూశామా?’ అంటూ ఆమె తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. అందం కొలమానంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులను మీడియా చూడటం లింగవివక్షేనంటూ ఆమె చేసిన పోస్టుకు ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ పలు కామెంట్లు వచ్చాయి. అధికారిణుల అందచందాల ఆధారంగా జాబితా తయారు చేయడం చాలా దుర్మార్గమంటూ ఆ పత్రిక తీరుపై మెరిన్ జోసెఫ్ మండిపడింది. ఒక మహిళ ప్రతిభను ఆమె రూపురేఖలు ఎలా నిర్ధారిస్తాయని తన పోస్ట్ లో ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News