: ఆమె బ్లెస్ చేశారు... విష్ చేశారు: నటుడు రావు రమేష్
‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో సహజనటి జయసుధతో కలసి నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆమెతో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ నటుడు రావు రమేష్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో జయసుధ కు భర్త పాత్రలో నటించానని చెప్పారు. సహజనటి జయసుధ ఫ్రేమ్ లో ఉంటే, సింగిల్ టేక్ లో చేస్తామో లేదోనని అనిపించేదని అన్నారు. అయితే, ఆమె తనను చాలా ప్రోత్సహించారని.. జయసుధ బ్లెస్ చేశారు, విష్ చేశారని చెప్పారు. నటనలో హిమాలయపర్వతం వంటి ఆమె పక్కన నటించడాన్ని తాను మరచిపోలేనంటూ రావు రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.