: నిమిషంలో 79 మందిని కౌగిలించుకొని గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్న హైదరాబాదీ
హైదరాబాద్ కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి ఒక్క నిమిషంలో 79 మందిని కౌగిలించుకొని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. గతంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని కౌగిలించుకున్న వ్యక్తిగా ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన క్యారి బిక్‌మోర్ పై ఉండేది. క్యారి బిక్‌మోర్ నిమిషంలో 77 మందిని కౌగిలించుకున్నాడు. తాజాగా 60 సెకన్లలో 79 మంది బడి ఈడు పిల్లలను కౌగిలించుకుని నగర వాసీయుడైన కృష్ణకుమార్ ఆస్ట్రేలియన్ పై ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్పీడ్ హగ్గింగ్ ఛాలెంజ్‌లో మొత్తం 88 మంది విద్యార్థులను కృష్ణకుమార్ కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉంచారు. 60 సెకన్లలో 83మంది విద్యార్థులను కౌగిలించుకున్నాడు. అయితే, 83 మందిలో నలుగురు విద్యార్థులను నిబంధనల ప్రకారం సరిగ్గా కౌగిలించుకోలేక పోవడంతో గిన్నిస్ రికార్డ్ నిర్ణేతలు కృష్ణకుమార్ 79 మందిని మాత్రమే కౌగిలించుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 సెకన్లలో 79మందిని కౌగిలించుకున్న వారు ప్రపంచంలో ఎవరూ లేరంటూ కృష్ణకుమార్ చేసిన రికార్డ్ ని గిన్నిస్ బుక్‌లో ఎక్కించేశారు.