: రఘురాం రాజన్ ఉండాల్సిందేనని ఆన్ లైన్ పిటిషన్... 50 వేలకు దగ్గరైన మద్దతుదారులు


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా రఘురాం రాజన్ ను కొనసాగించాలని కోరుకుంటున్న వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఆయనకు మద్దతుగా 'చేంజ్ డాట్ ఓఆర్జీ'లో ఒక ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభం కాగా, దానిపై సంతకం చేసిన వారి సంఖ్య 50 వేలకు చేరువైంది. నేటి సాయంత్రం 4 గంటల సమయానికి 44,620 మంది రాజన్ కు మద్దతు పలికారు. ఈ పిటిషన్ ను ప్రారంభించిన రాజేష్ పలారియా అనే వ్యక్తి, ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడంలో రాజన్ ఎంతో శ్రద్ధను కనబరిచారని, భారత్ వృద్ధి బాటన నడవాలంటే, ఆయన ఉండటం ఎంతో ముఖ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News