: ఓయూ విద్యార్థుల గురించి పట్టించుకోరేం?: రేవంత్ రెడ్డి


టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి మ‌రోసారి మండిప‌డ్డారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం త్యాగాల‌కు సిద్ధ‌ప‌డ్డ ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థుల గురించి కేసీఆర్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల ప‌రిహారం, ఐదెక‌రాల భూమి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై తాము అసెంబ్లీలో తీర్మానించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ఉత్స‌వాలు ట్యాంక్ బండ్‌పై కాకుండా ఓయూలోనే జ‌రిపించాల‌ని ఆయ‌న అన్నారు. విద్యార్థుల డిమాండ్స్‌పై త్వ‌ర‌లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న‌ మహానాడులో చర్చిస్తామని చెప్పారు. జూన్‌ 2న ఓయూలో జరిగే జనజాతరకు టీడీపీ నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News