: హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు పదిహేనేళ్లు... యంగ్ టైగర్ గురించి ఆసక్తికర విషయాలు


తాత ఎన్టీఆర్ పోలికలతో ఉండే యంగ్ టైగర్ జూనియన్ ఎన్టీఆర్ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి సరిగ్గా ఈరోజుకి పదిహేనేళ్లు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’. తన కెరీర్ లో ఇప్పటివరకు 25 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తనకు ఇష్టమైన ఆట క్రికెట్ అని.. బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమని అన్నాడు. అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ అంటే మహా ఇష్టమని, అది తన ఫేవరెట్ డిష్ అని, పుస్తకాలు చదవడంపై ఆసక్తి తక్కువని, అయితే వినడంపై ఎక్కువ ఆసక్తి కనపరుస్తానన్నాడు. ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎన్టీఆర్, శ్రీదేవి అని, తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా దానవీర శూరకర్ణ అని చెప్పిన యంగ్ టైగర్ తన లక్కీ నెంబరు ‘9’ అని చెప్పాడు. ఇక హీరోగా నటించిన మొదటి చిత్రం పారితోషికం రూ.3 లక్షలను జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి శాలిని చేతుల్లో పెట్టాడట. ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఎన్టీఆర్ కు గురువు జగ్గీ వాసుదేవ్.

  • Loading...

More Telugu News