: చంద్రబాబు గారూ, మీ ప్రత్యర్థి నాకు సలహాలివ్వడమేంటి?: కాపు ఉద్యమనేత ముద్రగడ మండిపాటు
‘చంద్రబాబుగారూ, మీ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వయసు నా రాజకీయ జీవితమంత లేదు. ఆయన నాకు సలహాలివ్వడమేంటి?’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన తాజాగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను జగన్ పక్షమని కనుక రుజువు చేస్తే కాపు ఉద్యమం ఆపేస్తానని, అదేకనుక నిరూపించలేకపోతే, మీరు ఏం చేస్తారో చెప్పాలని ఆ లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో కడుతున్న కాపు భవనాలకు ‘చంద్రన్న’ పేరు పెట్టాలని జీవోలు విడుదల చేసి, ఇప్పుడు భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.