: మ‌తి పోగొట్టేలా సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఫోబియా’ పోస్టర్


బాలీవుడ్ లో విడుద‌లకు సిద్ధంగా ఉన్న సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఫోబియా’. 'మెహతక్' అనే ఒక ఆర్టిస్టు పాత్రలో న‌టి రాధికా ఆప్టే ఈ సినిమాలో లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈనెల 27న ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర బృందం ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ‘ఫోబియా’ కొత్త పోస్టర్ చూప‌రుల మ‌తి పోగొట్టేలా ఉంది. ఒకే ముఖంలో మూడు ముఖాలు కనిపించేలా సూపర్ ఇంపోజ్ చేసిన ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడుతూనే, విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. అగోర‌ఫోబియా (జనం మధ్యకెళితే ఏదైనా జరుగుతుందనే విపరీతమైన భయం)తో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి భ‌య‌ప‌డే విలక్షణమైన పాత్రలో రాధికా ఆప్టే చిత్రంలో క‌నిపించ‌నుంది. ఈ పాత్రలో నటించడానికి రాధికా ఆప్టే తీవ్ర కసరత్తే చేసింది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల సందర్భంగా ప్రస్తుతం రాధిక సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూ బిజీ బిజీగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News