: అమరావతిలో ఫర్నీచర్ కూడా ఉండదు... ఎలా తరలివెళ్లాలో మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


జూన్ 27 నాటికి అన్ని శాఖల అధిపతులూ, తమతమ శాఖలను అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ, అందుకు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఎవరి కార్యాలయంలోని ఫర్నీచరును వారే తరలించుకోవాలని, అమరావతిలో ఏర్పాటయ్యే కార్యాలయాల్లో ఫర్నీచర్ ఉండదని తేల్చి చెప్పింది. కుర్చీలు, టేబుళ్ల నుంచి ఏసీల వరకూ అన్నింటినీ తీసుకెళ్లి అక్కడ అమర్చుకోవాలని, వారం రోజుల ముందు నుంచే పనులు ప్రారంభించాలని పేర్కొంది. 27 నాటికి సీఆర్డీయే పరిధిలో ప్రతి కార్యాలయం ఉండాలని, ముందుగా ప్రభుత్వ భవనాలు పరిశీలించాలని, అవి చాలవని భావిస్తే, మూడేళ్ల కాలపరిమితికి ప్రైవేటు భవంతులను వెతుక్కుని వాటిని లీజుకు తీసుకోవాలని సర్కారు తెలిపింది. వివిధ విభాగాధిపతులు తొలుత కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను సంప్రదించి, వారి సహాయం పొందాలని సూచించింది. ఈ మేరకు నేడు కమిషనరేట్లు, డైరెక్టరేట్లకు సాధారణ పరిపాలనా శాఖ నుంచి సర్క్యులర్లు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News