: ప్రజలకు ఎక్కువ కష్టాలు వస్తే ఎక్కువ కానుకలు సమర్పిస్తున్నారు!: దేవాదాయ శాఖ ఆదాయం పెరగడంపై చంద్రబాబు చమత్కారం


ప్రజలు ఎక్కువ తప్పులు చేస్తే, తమకు ఎక్కువ కష్టాలు వస్తే, దేవుళ్లకు ఎక్కువగా కానుకలు సమర్పిస్తున్నారని, అందువల్లే దేవాదాయ శాఖ అధికారులు పనిచేయకున్నా, ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చమత్కరించారు. ఈ ఉదయం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన దేవాదాయ శాఖ పనితీరును సమీక్షిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు లేకుంటే ప్రజలు పిచ్చివాళ్లై ఉండేవాళ్లని, ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ డబ్బును హుండీల్లో వేస్తున్నారని అన్నారు. 'కనీసం మంచి రోజులని చెప్పి కొందరు అయ్యప్ప స్వాములు వెళతారు. ఆ 40 రోజులు ఎమీ తాగకూడదు. నిష్టగా వుండాలి. అంటే ఆ నలభై రోజులు కంజంప్షన్ తగ్గిపోయిందన్న మాట' అన్నారు ముఖ్యమంత్రి.

  • Loading...

More Telugu News