: జూన్ 1 నుంచి తెలంగాణ ఎంసెట్-2 దరఖాస్తుల స్వీకరణ.. జులై 9న పరీక్ష
నీట్ పై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తెలంగాణలో ఎంసెట్-2 పరీక్షను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. తెలంగాణ ఎంసెట్-2కు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 28న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జులై 9న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ ఎంసెట్-2 పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని కోసం వచ్చేనెల 1నుంచి 7వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు జులై 2నుంచి 7వరకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. జులై 14న ర్యాంకుల ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు.