: టీఆర్ఎస్ నేత హత్యకు కుట్ర పన్ని తిరుగుతున్న ముగ్గురి అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతను హత్య చేసేందుకు కుట్ర పన్ని కత్తులతో తిరుగుతున్న ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. గోషామహల్ ప్రాంతానికి చెందిన పార్టీ నేత ఎం ఆనంద్ కుమార్ గౌడ్ ను చంపేందుకు ముగ్గురు తిరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందగా, గాలింపు చేపట్టిన పోలీసులకు అఫ్జల్ గంజ్ లో ముగ్గురిపై అనుమానం వచ్చింది. వారి నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకున్న గోషామహల్ పోలీసులు, కేసును అఫ్జల్ గంజ్ స్టేషనుకు అప్పగించారు. ఈ కుట్ర వెనుక ఓ మాజీ మంత్రి సోదరుడు, మాజీ కార్పొరేటర్ ప్లాన్లు ఉన్నట్టు అనుమానాలు ఉండగా, నిందితులను ప్రశ్నించిన తరువాతే విచారణను వేగవంతం చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.