: దుబాయి వెళ్లొస్తామన్న ఎమ్మెల్యేలు!... కస్సుమన్న వైఎస్ జగన్!
తన తాత రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు సొంతూరు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన పార్టీ ఎమ్మెల్యేలపై కస్సుమన్నారట. ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టిన నేపథ్యంలో నిత్యం ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నాం కదా... కొద్దిరోజుల పాటు విశ్రాంతి కోసం దుబాయి వెళ్లివస్తామంటూ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ముందు ప్రస్తావించారట. ఈ మాట వినగానే అంతెత్తున ఎగిరిపడ్డ జగన్... ఓ వైపు రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే విదేశీ పర్యటనకు వెళ్లి వస్తామంటారా? అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు విదేశాలకు వెళితే ఆయనపై విరుచుకుపడ్డ మనం... ఇప్పుడు మనమే విదేశీ పర్యటనకు వెళితే ఎలాగంటూ ఆయన ఒకింత అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. దీంతో విదేశీ పర్యటన ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేల నోట మాట రాలేదు. ఈ మేరకు ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది.