: రెండేళ్ల పాలనలో ఏం సాధించాం?: చంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మంత్రులు, కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు చంద్రబాబు నాయుడు సమావేశంలో కీలక ఉపన్యాసం చేయనున్నారు. రెండంకెల వృద్ధి రేటుపై కలెక్టర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై సమీక్షించనున్నారు. సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి పెట్టే అంశం గురించి చర్చించనున్నారు. సమావేశం ప్రారంభం సందర్భంగా మంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులు రావడం లేదని అన్నారు.