: ఆర్డీఎస్ మీ ఇద్దరి సమస్య... మీకు మీరే తేల్చుకోండి!: ఏపీకి షాకిచ్చిన కర్ణాటక


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పెద్ద అగాధాన్నే సృష్టించింది. ఎత్తు పెంచేందుకు తెలంగాణ యత్నిస్తుండగా, దానిని అడ్డుకునేందుకు ఏపీ శతథా యత్నిస్తోంది. తన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న తెలంగాణ సర్కారుకు పరోక్షంగా షాకిద్దామని భావిస్తున్న ఏపీకి నిన్న పెద్ద షాకే తగిలింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ పై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు నిలిపివేయించాలని ప్లాన్ వేసిన ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును నిన్న బెంగళూరు పంపింది. కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి గురుపాద స్వామితో చర్చలు జరిపి... ఆర్డీఎస్ వద్ద జరుగుతున్న పనులను నిలిపివేయించాలని వెంకటేశ్వరరావును ప్రభుత్వం అక్కడకు పంపింది. అయితే ఆయన ప్రతిపాదనలకు గురుపాదస్వామి పెద్దగా స్పందించలేదు. అయినా ఆర్డీఎస్ సమస్య తెలుగు రాష్ట్రాలకు చెందినదని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన తేల్చేశారు. ‘మీ మధ్య సమస్యను... మీకు మీరే తేల్చుకోండి. మమ్మల్ని లాగొద్దు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వెంకటేశ్వరరావు నిరాశగా వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News