: అదంతా తప్పుడు ప్రచారం!... కాంగ్రెస్ ను వీడేది లేదంటున్న వంశీచంద్ రెడ్డి


కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ ఆకర్ష్ మంత్రం ఇంకా పనిచేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ టీడీపీని దాదాపుగా ఖాళీ చేసేసిన గులాబీ దళం... కాంగ్రెస్ పైనా దృష్టి సారించింది. ఈ క్రమంలో పాలమూరు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిపై ఆ పార్టీ వల విసిరింది. త్వరలోనే వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ కు ‘చేయి’చ్చి కారు ఎక్కుతున్నారంటూ పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పుకార్లు జోరందుకున్నాయి. ఈ వార్తలపై వంశీచంద్ రెడ్డి కాస్తంత ఘాటుగా స్పందించారు. నిన్న పాలమూరు జిల్లా వెల్దండలో మీడియాతో మాట్లాడిన ఆయన... తన ఎదుగుదలకు కాంగ్రెస్ ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని కూడా వంశీచంద్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ లో తాను చేరుతున్నానంటూ వినిపిస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన తెలిపారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News