: ఏపీ సీఎంకు ఓఎస్డీగా... తెలంగాణ జర్నలిస్ట్!
నిజమేనండోయ్... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నియమితులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాసరావు... ఏపీ సీఎంకు ఢిల్లీలో ఓఎస్డీ (మీడియా సంబంధాలు)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిన నియమితులైన శ్రీనివాసరావు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ మీడియాలో విశేష ప్రచారమే లక్ష్యంగా తేలప్రోలు నియామకం జరిగింది.