: షాపులో టీ షర్టులు నొక్కేసిన జెనీలియా భర్త... వీడియో వైరల్... డైలమాలో అభిమానులు!


టాలీవుడ్ హాసిని (జెనీలియా డిసౌజా) భర్త బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ ముఖ్‌ 'ట్రూబ్లూ' షాపులో దుస్తులు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లోని ట్రూబ్లూ బ్రాండ్ బట్టల షాపులో కొన్ని దుస్తులను ట్రై చేసిన రితేష్ దేశ్ ముఖ్...మరికొన్ని టీషర్టులను టీషర్టు లోపల పెట్టుకోవడం సీసీ పుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అదిప్పుడు ఆన్‌ లైన్‌ లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో రితేష్ అభిమానులు తలకొట్టేసినట్టు ఫీలవుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులకైతే ఏమనాలో అర్థం కావడం లేదు. ఇంతకీ ఇది దొంగతనమా? లేక రితేశ్‌ తాజాగా నటించిన 'హౌస్‌ ఫుల్‌ 3'లో సన్నివేశమా? లేక 'ట్రూబ్లూ' బ్రాండ్‌ ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియోనా? అన్నది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News