: స్టంట్స్ చేసే హీరోలకు, స్టంట్ మాస్టర్లకు ఇన్సూరెన్స్ పాలసీలుండాలి: హీరో అక్షయ్ కుమార్
మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ తో తనదైన శైలిలో స్టంట్స్ చేసే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన మనస్సులో మాట బయటపెట్టాడు. సినిమాల్లో స్టంట్స్ చేసే హీరోలకు, స్టంట్ మాస్టర్లకు ఇన్సూరెన్స్ ఉండాలని అభిప్రాయపడ్డారు. స్టంట్ చేసే వాళ్లు తమ ఆరోగ్యం గురించి ఎలాగూ పట్టించుకుంటారని, అంతకు మించి వారి పేరిట ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉండాలని అన్నారు. నిజాయతీగా మాట్లాడటమంటే తనకు ఇష్టమని చెప్పిన ఈ హీరో సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించడం చాలా కష్టమని అన్నాడు. కాగా, సాజిత్ ఫర్హాద్ దర్శకత్వం వహించిన ‘హౌస్ ఫుల్ 3’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.