: గుజరాత్ కు షాక్... కీలకమైన ఆ ముగ్గురూ అవుట్!


ఐపీఎల్ లో భాగంగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బెంగళూరు జట్టు ఐపీఎల్ లో పాల్గొన్న జట్లన్నింటిలోకి పేలవమైన బౌలింగ్ ఆర్డర్ కలిగిన జట్టుగా విశ్లేషకులు పేర్కొంటారు. అలాంటి బెంగళూరు బౌలర్లు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో నిప్పులు చెరిగారు. రెండో ఓవర్ లో భారీ షాట్ కు యత్నించిన మెక్ కల్లమ్ (1) ను అబ్దుల్లా అవుట్ చేయగా, అనంతరం మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (4) ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం రైనాకు ప్రత్యేక పీల్డింగ్ సెట్ చేసిన కోహ్లీ, వాట్సన్ అద్భుతమైన బంతి సంధించడంతో దానిని ఆడిన రైనా పాయింట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న అరవింద్ చేతుల్లోకి ఆడాడు. దీంతో కేవలం 5 ఓవర్లకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ జట్టు 20 పరుగులు చేసింది. క్రీజులో దినేష్ కార్తిక్ (3), డ్వేన్ స్మిత్ (10) వున్నారు.

  • Loading...

More Telugu News