: కోహ్లీ వర్సెస్ రైనా...పోరు ప్రారంభం...2 వికెట్లు కోల్పోయిన గుజరాత్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 9లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ ఆదిలోనే డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ వికెట్ కోల్పోయింది. భారీ షాట్ కు యత్నించిన మెక్ కల్లమ్ లాంగ్ ఆఫ్ లో ఏబీ డివిలియర్స్ కు చిక్కాడు. టాప్ బ్యాట్స్ మన్ అవుట్ కావడంతో బెంగళూరు జట్టు ఆనందంలో మునిగిపోయింది. ఆ వెంటనే ఆరోన్ ఫించ్ కూడా వెనుదిరగడంతో గుజరాత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్లిద్దరూ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ లయన్స్ జట్టు మెక్ కల్లమ్ (1), ఫించ్ (4) వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది. రెండు వికెట్లు అబ్దుల్లాకు దక్కడం విశేషం.

  • Loading...

More Telugu News