: బీజేపీ విజయోత్సవ కార్యక్రమానికి బిగ్ బీ వ్యాఖ్యానం


కేంద్రంలో పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఈ నెల 28న ఇండియా గేట్ వద్ద విజయోత్సవాలు నిర్వహించనుంది. ఈ వేడుకల్లో వ్యాఖ్యాతగా అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను కీర్తిస్తూ ఆయన వ్యాఖ్యానం చేయనున్నారు. ఐదు గంటల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులంతా పాల్గోనున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టీవీ నటులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన చర్యలు, ప్రవేశపెట్టిన పథకాలను గురించి పలువురు మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు జరగనున్న 'వికాస్ పర్వ' వేడుకలు ఈ నెల 26న ప్రారంభం కానుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని సహరాన్‌ పూర్‌ లో జరుగనున్న ర్యాలీలో మోదీ ప్రసంగించిన అనంతరం, ఈ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News