: మోదీ కోసం తన 8 ఎక‌రాల పంట‌ను తొల‌గించి, స‌భ‌ నిర్వ‌హ‌ణ‌కు సాయం చేసిన ముస్లిం రైతు


దేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఉత్తరప్రదేశ్ లో ఈనెల 26న బీజేపీ నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన ర్యాలీ కోసం రియాజ్ అనే ముస్లిం రైతు త‌న‌ 8 ఎకరాల స్థలంలో తాను వేసుకున్న పంటను తొలగించి మోదీపై అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే, మోదీ స‌భ‌ ఎటువంటి ఆటంకం లేకుండా జ‌ర‌గాల‌ని కోరుకున్నాడు. సహారన్‌పూర్‌లో బీజేపీ 256 ఎక‌రాల్లో త‌మ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు అక్క‌డ ఉన్న రియాజ్ స్థ‌లాన్ని కావాల‌ని అడ‌గ‌గా వెంటనే అంగీకరించి, తన పొలంలోని పంట‌నంతా తొల‌గించాడు. అంతేకాదు, బీజేపీ నేత‌లు రియాజ్‌కి ప‌రిహారం ఇస్తామ‌ని చెబితే.. త‌న‌కు ప‌రిహారం కూడా వ‌ద్ద‌ని తిరస్కరించాడు.

  • Loading...

More Telugu News