: రోడ్డుప్రమాదంలో ‘సింధూర పువ్వు’ డైరెక్టర్ దేవరాజు మృతి


కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ సినిమా డైరెక్టర్ దేవరాజు(60) మృతి చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి దేవరాజు తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. తొలుత కారులో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా డోన్ హై వే ఓబులాపురం మిట్ట వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో దేవరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవరాజు మృతదేహాన్ని కోయంబత్తూరుకు తరలించారు. కాగా, రాంకీ, నిరోషా హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సింధూర పువ్వు’ దర్శకుడు దేవరాజు. మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమకు తన సేవలందించారు. ప్రస్తుతం తమిళ సీరియల్స్ కు డైరెక్టర్ గా ఉన్న దేవరాజు మృతిపై సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News