: మీడియాకు 'స్వీట్' షాక్ ఇచ్చిన కాబోయే కేరళ సీఎం
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే కాబోయే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు మీడియాను ఆశ్చర్యపరిచారు. పాత్రికేయులను పిలిచి అందరి చేతుల్లోను ఆయన స్వీట్ బాక్సులు ఉంచారు. ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా విజయన్ తమకు స్వీట్ పార్టీ ఇచ్చారని మీడియా అనుకుంది. అయితే, అసలు విషయం అది కాదని, ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా స్వీట్స్ ఇచ్చానని విజయన్ చెప్పడంతో మీడియా ఆశ్చర్యపోయింది. మీడియాను ఆశ్చర్యపరిచేందుకు తాను ఈ విధంగా చేశానని ఆయన చెప్పారు. రికార్డుల ప్రకారం అయితే తన బర్త్ డే మార్చి 21,1944 అని, వాస్తవానికి తన పుట్టిన రోజు మే 24, 1945 అని విజయన్ మీడియాకు చెప్పారు.