: స్టాలిన్ వస్తున్నట్టు తెలిస్తే ముందు వరుసలో కుర్చీ వేసేవాళ్లం: జయలలిత
డీఎంకే అధినేత కరుణానిధి ఆవేదనను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అర్థం చేసుకున్నారు. పెద్దాయన బాధపడ్డారని భావించిన జయలలిత దానిపై వివరణ ఇచ్చారు. డీఎంకే భవిష్యత్ అధ్యక్షుడు స్టాలిన్ తన ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్టు ముందే తెలిసి ఉంటే ఆయనకు మొదటి వరుసలో సీటు కేటాయించేవారమని అన్నారు. ప్రతిపక్ష నేతను పిలిచి అవమానించాలన్న కోరిక లేదని, ఆయన రాకకు సంబంధించిన సమాచారం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆమె వివరణ ఇచ్చారు. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్టాలిన్ కు 16వ వరుసలో సీట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై కరుణానిధి ఆవేదన వ్యక్తం చేశారు.