: ప్రభుత్వం, ప్రజలు అడుగులో అడుగు వేస్తూ నడవాలి: మోదీ పిలుపు
ప్రశాంత చిత్తుడైన శర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గువాహటిలో ఆయన మాట్లాడుతూ, సోనోవాల్ పై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. శర్బానంద సోనోవాల్ సారధ్యంలో అసోం ప్రజలు బీహార్, బెంగాల్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. సోనోవాల్ తో అడుగులో అడుగు వేస్తూ నడిస్తే రాష్ట్రం ముందజవేస్తుందని ఆయన చెప్పారు. శర్బానంద సోనోవాల్ ప్రశాంత చిత్తుడని, సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుని పని చేస్తారని ఆయన కితాబునిచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు అసోం ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.