: 10 కోట్ల గోల్ మాల్ కేసును ఛేదించిన తుకారాంగేట్ పోలీసులు
సికింద్రాబాదులోని ఏటీఎంలలో డబ్బులు నింపే సంస్థ నుంచి 10 కోట్ల రూపాయల గోల్ మాల్ కేసును తుకారాంగేట్ పోలీసులు ఛేదించారు. సికింద్రాబాదులోని ఆర్ సీఐ కంపెనీలో పని చేసే ముగ్గురు ఉద్యోగులు ఆ సంస్థ యజమాని సహాయంతో 45 రోజుల్లో వివిధ ఏటీఎంల నుంచి 10 కోట్ల రూపాయలను గోల్ మాల్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని విచారణ చేయడంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ లో బెట్టింగ్ కోసం డబ్బు దొంగతనం చేసినట్టు తెలిపారు. వీటి నుంచి 4.5 కోట్ల రూపాయలను బెట్టింగ్ కోసం వినియోగించినట్టు తెలిపారు. మిగిలిన 5.5 కోట్ల రూపాయలతో ఆస్తులు, కార్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. దీంతో వారిని అరెస్టుచేసి రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించినట్టు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు.