: అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనోవాల్
అసోం ముఖ్యమంత్రిగా శర్బానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అసోం రాజధాని గువాహటీలో జరిగిన శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు హాజరయ్యారు. కాగా, కేబినెట్ సహచరుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది.