: ఏపీ ఎంసెట్ ‘ఇంజినీరింగ్’ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలకు సంబంధించిన వివరాలపై ఈనెల 27న అధికారికంగా ప్రకటన చేయనున్నారు. వచ్చేనెల 6నుంచి 9వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ 15నుంచి కళాశాలల కోసం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ తరగతులు నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ లో 1,31,581 మంది విద్యార్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే.