: పొరపాటున సిమ్ కార్డు మింగేసిన బాలిక!


ఇటీవల వెలువడిన కేరళ ఎన్నికల ఫలితాలను టీవిలో చూస్తూ, వాటి గురించి తమ తల్లిదండ్రులతో చర్చిస్తున్న ఒక పదహారేళ్ల బాలిక తన చేతిలో ఉన్న సిమ్ కార్డును పొరపాటున మింగేసింది. ఈ సంఘటన కేరళలోని త్రిశూర్ లో జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున అశ్వతి అనే బాలిక పొరపాటున తన చేతిలోని సిమ్ కార్డును మింగేసింది. వెంటనే అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు ఆ సిమ్ కార్డును కక్కించేందుకని ఆమెకు పలు రకాల తినుబండారాలు పెట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో, వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. బాలిక ఊపిరితిత్తుల వద్ద సిమ్ కార్డు అతుక్కుని ఉందని సీటీ స్కానింగ్ చేసిన వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి ఆ సిమ్ కార్డును బయటకు తీయడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

  • Loading...

More Telugu News