: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. 'ప్రమోషన్ల రద్దు' రద్దైంది!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల ప్రమోషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగుల ప్రమోషన్ల రద్దు ఉత్తర్వులను టీఆర్ఎస్ సర్కార్ ఈరోజు రద్దుచేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తెలంగాణ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.