: ఎమ్మెల్యేలు ఎక్కడికీ పోవద్దు... పిలిస్తే పలికేలా ఉండాలి: ఏపీ టీడీపీ అధ్యక్షుడు
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ శాసనసభ్యులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలు ఎవరూ అనుమతి లేకుండా దూర ప్రయాణాలు చేయవద్దని, అధిష్ఠానానికి నిత్యమూ అందుబాటులో ఉండాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున, ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ పిలిస్తే పలికేలా ఉండాలని ఆయన సూచించారు. కాగా, ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, మూడింట తెలుగుదేశం, ఒకదానిలో వైకాపా అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైకాపా గెలిచే నాలుగో స్థానంపైనా తెలుగుదేశం కన్నేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.