: దావూద్ ను భారత్ కు రప్పించడం ఖాయం: హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేసి త్వరలోనే భారత్ కు తీసుకువస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన దావూద్ ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అందుకుగాను, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దావూద్ ను భారత్ కు తీసుకువస్తామన్నారు.దావూద్ ను భారత్ కు అప్పగించే విషయమై పాకిస్థాన్ ను ఒప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోందని రాజ్ నాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News