: ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటూ దుబారా చేస్తున్న చంద్రబాబు: వైసీపీ నేత అంబటి రాంబాబు


ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతుంటే, మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటూ దుబారా ఖర్చులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టార్ హోటల్ లో బస చేస్తున్న చంద్రబాబు తక్షణమే బయటకు రావాలని, దుబారా ఖర్చులను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తున్న టీడీపీ నేతలు కాపుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మినీ మహానాడు పేరుతోనూ టీడీపీ నేతలు దోచుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని ఏపీ సర్కార్ జీవో విడుదల చేసిందని, మళ్లీ తమకేమీ తెలియనట్లుగా నాటకాలాడుతోందని విమర్శించారు. ఏపీ సర్కార్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన మేధావులకు, స్వామీజీలకు రాజకీయాలు అంటగట్టడం.. జగన్మోహన్ రెడ్డిని నిందించడం సబబు కాదని అంబటి రాంబాబు అన్నారు.

  • Loading...

More Telugu News