: వంద రూపాయల అద్దెతో 850 ఎకరాలు...షరతులు వర్తిస్తాయి!


ఇంగ్లండ్ లోని సౌత్‌ వేల్స్‌ సమీపంలో 850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్స్‌ ఫామ్‌ ను ఏడాదికి కేవలం వంద రూపాయలకే అద్దెకిస్తామని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. పదేళ్ల పాటు ఈ అగ్రిమెంట్ వర్తించనుంది. అయితే 850 ఎకరాల ఫామ్ హౌస్ ను వంద రూపాయల అద్దెకు ఇస్తున్నారంటే నమ్మశక్యంగా ఉండదు కదా? అందుకే షరతులు వర్తిస్తాయనే ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. ఈ షరతులు ఏంటంటే...సముద్రం అంచున ఉన్న ఈ పార్స్‌ ఫామ్‌ ను అద్దెకు తీసుకుంటే అందులోని 4 బెడ్‌ రూంల ఇల్లుతో పాటు.. 416 గొర్రెలను కూడా ఇస్తారు. పర్యావరణం, ప్రకృతిపై మక్కువ ఉన్నవారికి మాత్రమే దీనిని అద్దెకు ఇవ్వనున్నారు. అయితే ఈ ఫామ్‌ లో కొన్ని అంతరించిపోతున్న జీవ జాతులు ఉన్నాయి. ఈ ఫామ్ ను అద్దెకు తీసుకున్నవారు వాటిని కాపాడాల్సి ఉంటుంది. అందుకే దరఖాస్తులో వారెలా వాటిని కాపాడుతారో వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో వ్యవసాయంలో అనుభవం, ప్రకృతిని పరిరక్షించేందుకు గతంలో తీసుకున్న చర్యలు వివరించాల్సి ఉంటుంది. ఇవన్నీ నేషనల్‌ ట్రస్ట్‌ ప్యానల్‌ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుందట. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ జూన్ 10...ఉత్సాహంగా వున్న వారు దరఖాస్తు చేయండి మరి.

  • Loading...

More Telugu News