: తల్లి మందలించిందని కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముగ్గురు చిన్నారులు
తల్లి మందలించిందనే కోపంతో ముగ్గురు పిల్లలు ఇల్లు వదిలి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పరిధి జల్లెలగూడలోని వెంకటగిరి కాలనీలో చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తల్లి మందలించిందనే కోపంతో ముగ్గురు పిల్లలు శ్రీశైలం(10), రేణుక(8), శివ(7) ఇల్లు వదిలి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడవెతికినా పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల అదృశ్యంపై మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఫిర్యాదు చేశారు. పిల్లల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.