: బ్రిటన్ పార్లమెంటులో సందడి చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్
టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ పట్టణ శాసనసభ్యుడు బిగాల గణేష్ నేడు బ్రిటన్ పార్లమెంట్ ను సందర్శించారు. ఎన్నారై, ఇండో-బ్రిటన్ ఎంపీల సంఘం చైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు లండన్ చేరుకున్న ఆయన పార్లమెంట్ కు వెళ్లి, అక్కడి వివిధ విభాగాలను గురించి తెలుసుకున్నారు. శర్మ దగ్గరుండి మరీ గణేష్ కు బ్రిటన్ పార్లమెంట్ చరిత్రను గురించి వివరించగా, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ విజయాల గురించి గణేష్ తెలియజెప్పారు. త్వరలో తెలంగాణలో పర్యటించాలని శర్మను కోరినట్టు ఈ సందర్భంగా గణేష్ వెల్లడించారు. ఓ ప్రైవేటు పర్యటనగా ఎమ్మెల్యే బ్రిటన్ యాత్ర సాగగా, ఆయన సోదరుడు మహేష్ కూడా వెంట ఉన్నారు.