: కాశ్మీర్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్


‘సరైనోడు’ చిత్రం సక్సెస్ తో హుషారుగా ఉన్న అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ టూర్ కి వెళ్లాడు. కాశ్మీర్ లోని అందమైన ప్రాంతాలను, సుందర దృశ్యాలను చూస్తూ బన్నీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని బన్నీ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపాడు. బన్నీ, భార్య స్నేహాలతో పాటు పలువురు స్నేహితులు ఉన్న ఒక ఫొటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, ఈ టూర్ నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. విక్రమ్ కుమార్ లేదా లింగు స్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో అర్జున్ నటించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News