: చంద్రబాబు వచ్చే వరకూ వేచి చూడని జపాన్ బృందం!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించి సలహా, సూచనలు ఇచ్చేందుకు బయలుదేరిన జపాన్ బృందం, కనీసం బస్సును కూడా దిగకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ బృందం సచివాలయ సమీపంలో పర్యటించాల్సి వుంది. ఈ ఉదయం వెలగపూడికి వచ్చిన జపాన్ అధికారులు, బస్సులో నుంచే అటూ ఇటూ చూసి వెనుదిరిగి వెళ్లిపోగా, వారు వెళ్లిన కాసేపటికి చంద్రబాబు ఆ ప్రాంతానికి వచ్చారు. తాను వచ్చే వరకూ వేచి చూడకుండా వెళ్లిపోయిన జపాన్ బృందం వైఖరి పట్ల చంద్రబాబు విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆపై చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.