: చంద్రబాబు సర్కారు మానవ హక్కులను ఉల్లంఘించింది!: హెచ్చార్సీని ఆశ్రయించిన ఏపీసీసీ


ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందని ఏపీసీసీ ధ్వజమెత్తింది. నిన్న విజయవాడలో జరిగిన ధర్నాకు పోలీసుల అనుమతి ఉన్నా, ఆందోళనను అణచివేసిన ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నేతలను నిర్బంధించిందని ఆరోపించింంది. ఈ వ్యవహారం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వాదించిన ఏపీసీసీ... రాష్ట్ర మానవ హక్కుల సంఘం ముందు తన గళాన్ని వినిపించింది. అంతేకాకుండా తమ నేతలను అక్రమంగా నిర్బంధించిన చంద్రబాబు ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చార్సీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని హెచ్చార్సీ కార్యాలయానికి వచ్చిన ఏపీసీసీ ప్రతినిధులు చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News