: డెహ్రాడూన్‌లో పోలీసు గుర్రం ‘శ‌క్తిమాన్’కి గుర్తుగా విగ్ర‌హం


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన‌ పోలీస్ గుర్రం ‘శ‌క్తిమాన్’కి గుర్తుగా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ధ్యాన్‌ సింగ్‌ నేగి అనే శిల్పి రూపొందిస్తోన్న‌ ఈ విగ్ర‌హ ప‌నులు ఇప్ప‌టికే 60శాతం పూర్త‌య్యాయ‌ని అక్క‌డి పోలీసు అధికారులు తెలిపారు. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తుతో రూపొందిస్తోన్న ఈ విగ్ర‌హాన్ని డెహ్రాడూన్ లోని పోలీస్‌ లైన్స్‌లోని బ్యాడ్మింటన్‌ కోర్ట్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయిస్తున్నామ‌ని చెప్పారు. పోలీస్ అశ్వ‌క ద‌ళంలో సేవ‌లందించిన‌ శ‌క్తిమాన్ జ్ఞాప‌కాలు త‌మ‌తో ఇక ఎప్ప‌టికీ నిలిచిపోతాయ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News