: మా డబ్బు తింటూ మాపైనే విమర్శలా?: కేసీఆర్ పై దత్తన్న నిప్పులు


కేంద్రంలోని తమ ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఖర్చు చేస్తూ, పరిపాలన సాగిస్తున్న కేసీఆర్, బీజేపీ నేతలపై విమర్శలు చేస్తుండటాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తప్పుబట్టారు. ఈ ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ ప్రారంభం కాగా, దత్తన్న ప్రసంగిస్తూ, బీజేపీ నేతలపై కేసీఆర్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, కేసులు పెడతామని బెదిరించినా సహించేది లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని, ఎన్డీయే పాలనపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని దత్తాత్రేయ కార్యకర్తలకు ఉద్బోధించారు. మోదీ అభివృద్ధి పనులను పల్లె పల్లెకూ తీసుకెళ్లాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News