: 0.6 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి ఆస్ట్రియా అధ్యక్షుడిగా ఎన్నికైన అలెగ్జాండర్ వాండెర్ బెలెన్
ఆస్ట్రియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ వాండెర్ బెలెన్ అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. తన ప్రత్యర్థి నోర్ బెర్డ్ హాపర్ పై ఆయన విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో వాండెర్ బెలెన్ కు 50.3 శాతం ఓట్లు రాగా, ఫ్రీడమ్ పార్టీకి చెందిన హాపెర్ కు 49.7 శాతం ఓట్లు లభించాయి. ఈ విజయంతో దేశాధ్యక్ష పదవి వాండెర్ బెలెన్ వశమైంది. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమానికి పాటు పడతానని, విదేశాలతో మరింతగా ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.