: విశాఖలో దారుణం.. బైక్ పై వెళుతోన్న ముగ్గురిని కారుతో ఢీ కొట్టిన పోకిరీలు.. యువతి మృతి
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులతో ఓ యువకుడు నూకాంబిక అమ్మవారి దర్శనం కోసం బైక్ పై వెళుతోన్న సమయంలో పలువురు పోకిరీలు వారి వెంట పడ్డారు. యువతులతో ఉన్న యువకుడితో పోకిరీలు గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వెళుతోన్న ముగ్గురిని పోకిరీలు కారుతో ఢీ కొట్టారు. పోకిరీల చర్యలకు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. మరో యువతి, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట దీనిని పోలీసులు, మృతురాలి బంధువులు సాధారణ ప్రమాదంగా భావించారు. అయితే ఆసుపత్రిలో కోలుకున్న మరో యువతి నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఘటన పట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.