: ‘అమ్మ’పై వీరాభిమానం.. ఒక్క రూపాయికే ఆటో స‌ర్వీసు అందించిన డ్రైవర్


అన్నాడీఎంకే అధినేత్రి,'పురచ్చితలైవి' జె.జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా ‘ఆమ్మ’ అభిమాని అయిన కోయింబ‌త్తూరులోని ఓ ఆటోడ్రైవ‌ర్ నిన్న ఒక్క రూపాయి ఛార్జీకే ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాడు. 45ఏళ్ల మాథివనమ్ 25సంత్స‌రాలుగా ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అన్నాడీఎం పార్టీని స్థాపించిన ఎంజీ రామ‌చంద్ర‌న్‌కి మాథివనమ్ వీరాభిమాని. ఎంజీఆర్ ప‌ట్ల అభిమానాన్ని కొన‌సాగిస్తూనే జ‌య‌ల‌లిత అభిమానిగా మారాడు. అన్నాడీఎంకే పార్టీ గెలుపొందిన ప్ర‌తీసారీ ఏదో విధంగా త‌న అభిమానాన్ని చాటుతూనే ఉన్నాడు. అయితే ఈసారి అన్నాడీఎంకే గెలుపొంది జ‌య‌ల‌లిత వ‌ర‌స‌గా రెండో సారి ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా ఒక్క‌రూపాయికే ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాల‌ని త‌న‌కో కొత్త ఐడియా వ‌చ్చింద‌ని మాథివ‌న‌మ్ చెప్పారు. సిటీలో ఎక్క‌డినుంచి ఎక్క‌డిక‌యినా ఒక్కో రూపాయికే నిన్న ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌న ఆటోపై జ‌య‌ల‌లిత పోస్ట‌ర్లు అంటించి, ఒక్క రూపాయికే ఎక్క‌డినుంచి ఎక్క‌డికైనా సేవ‌లందిస్తాన‌ని పేర్కొన్నాన‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News