: వరంగల్ కు చాన్సొచ్చింది... రెండో విడత స్మార్ట్ నగరాల జాబితా ఇదే
రెండో విడత స్మార్ట్ నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు 13 నగరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ కు స్థానం లభించింది. వరంగల్ తో పాటు లక్నో, ధర్మశాల, చండీగఢ్, రాయపూర్, కోల్ కతా, భాగల్ పూర్, పనాజి, పోర్టు బ్లెయిర్, రాంచీ, ఇంఫాల్, అగర్తలా, ఫరీదాబాద్ నగరాలను రెండో విడత స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నట్టు వెంకయ్య ప్రకటించారు.