: తనను చంపేస్తారేమోనని తెలుగు నటి అపూర్వ ఫిర్యాదు


తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు అనిపిస్తోందని, రాత్రిళ్లు తన ఇంటివద్ద అపరిచితులు తిరుగుతున్నారని, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ నటిగా రాణిస్తున్న అపూర్వ హైదరాబాదు, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అపూర్వ సిద్ధార్థనగర్ లో నివాసం ఉంటోంది. ఆమె ప్రయాణిస్తున్న కారును, విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద ఈ నెల 21న మరో కారు ఢీకొనగా, అది పూర్తిగా దెబ్బతింది. కారుకయ్యే రిపేరు ఖర్చును భరించేందుకు అంగీకరించిన వారు, మరమ్మతులు కూడా చేయించారట. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ పై తనను బెదిరిస్తూ కాల్స్ వచ్చాయని ఆమె ఫిర్యాదు చేసింది. చంపేస్తామని బెదిరించినట్టు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News